
తొలకరిలో తీపి సందేశాల తొలి సంతకాలు ...
మనసు చేసెను ఆనందతాండవాలు...
జవరాలితో జత కడుతున్న జతగాళ్ళు ...
కవ్విస్తున్న చిరు గాలులు...
కౌగిలి లో కైదు కమ్మని సంకేతాలు ...
చిరునవ్వులు చిందిస్తూ ...
సెలయేటి సడులను పలికిస్తూ...
జగత్ జయానికి చేయి కలుపుతూ ...
నిజాయితీ ధైర్యాలను ఆయుధాలుగా చేస్తూ...
మాట నుండి పాట వరకు...
నడక నుండి నాట్యం వరకు ...
సామాన్యం నుండి సామ్రాజ్యం వరకు...
చైతన్యపరుస్తూ.. ఉత్తేజపరుస్తూ ...
స్పూర్థినిస్తూ .. ప్రోత్సహిస్తూ...
నవనాడుల్లో జీర్నించుకుపోఏలా...
అవరోధాలని అధిగమిస్తూ ...
మజిలీని చేరువరకు...
దశను నిర్దేశించు మార్గదర్శి 'చిరంజీవి'
మీ అభిలాశే మా లక్ష్యంగా ...
మీ నడతే మా నడవడికగా ...
మీ స్వమార్గమే మా సుమార్గంగా ...
మీ పరిపాలనలో భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ...
మీ అభిమాని ...
ఆత్మీయ బంధమై పెనవేసుకున్నావ్ ...
తెలియని అనుభూతిని మనసుతో జత పరిచావ్ ..
జ్ఞాపకాల నిధిని నిక్షిప్తం చేసావ్ ..
అపేక్షనే అపురూపం గా అందించావ్ ..
ఇప్పుడు ఉపేక్షించేలా చేస్తున్నావ్ ..
మమతనే మనోబలం గా మర్చావ్ ..
మౌనమ్ గా ఉంటూ మదనపడేలా చేస్తున్నావ్..
నను వక్తగా మార్చడానికి నువ్వు శ్రోతవైనావ్ ...
నీ వాత్సల్యంతో వారధులు దాటి వచ్చలా చేస్తున్నావ్ ...
వేచి చూస్తున్నా..వేయి కన్నులతో నీ రాకకై ..
వేచి చూస్తున్నా..నీ నుంచి వచ్చే చిలిపి సందేశానికై..
వేచి చూస్తున్నా ..నీ పలకరింపుల పిలుపుకై ..
వేచి చూస్తున్నా ..నీ ప్రేమ జల్లులో తడిసిపోవాలని ..
వేచి చూస్తున్నా ..వేయి జన్మలకైనా ,
నా మది నిను చేరి మోక్షం పొందుతుందని ..
ఎన్ని యుగాలైనా గడచిపోని ..తర్వాతి యుగాంతంలోనైనా..
నా హృదయ వీణను మీటిన నాదంగా నన్ను చేరుతావని ...
............నీకై వేచి వుంటా
నీకై నిరీక్షించే కొన్ని యుగాలు కుడా నిన్ను చూడగా
......ఓ క్షణాన్ని తలపించదా...
కాలం మంచు లా కరగదా నీ ఆలోచనలతో ...
నీకై ఆశ తో కాదు... నువ్వే ఆశయం గా జీవిస్తున్న ...
కలత చెందనీయకుండా ..కన్నీళ్లు పెట్టనీయకుండా ...
దూరం గా వుంటూ దరి చేరుతూ ..
మనసుకు హత్తుకుని ...మౌనమ్ తో సమాదానపరుస్తున్నావ్...
నువ్వు నువ్వుగా వుంటూ ..నన్ను నన్నుగా వుండమంటూ ...
అనుభవం తో అంతరార్థం తెలియచేస్తున్నావ్ ...
నీకు నువ్వే సాటి అని చెప్పకనే చెబుతున్నావ్....
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..