Friday, May 8, 2009


గుండెలపై నిలుపుకోలేను ...గుండె లోతుల్లోనుంచి తుడపలేను..

మాటలు కలుపలేను..కలిపి నిలువలేను...

తలచకుండా వుండలేను ..ఆ తలపును విడువలేను..

అందం తో ఆకట్టుకోలేను..ఆరాధించకుండా వుండలేను...

ప్రేమిస్తున్నానని చెప్పలేను..ఆ ప్రేమను దాచలేను..

నాలో నాకే తెలియని సంఘర్షణ..అది నీకై నా నిరీక్షణ..

నా హృదయ స్పందన నీకు తెలిసేది ఎన్నడో...

నీ ప్రతిస్పందన నను తాకేది ఎన్నడో...

1 comment:

  1. spandana andariki kaluguthundi......anduke prathi spandana goppadi......adi andhariki radu kada........

    ReplyDelete