Friday, April 29, 2011


ప్రేమ పుష్పించే ప్రతి చోట వెదచల్లుతుంది తన పరిమళాన్ని.....
ఆకర్షిస్తుంది అనంత జీవరాసుల్ల్ని...
విలపించేలా చేస్తుంది మనసున్న ప్రతీ జీవినీ...
మిగులుస్తుంది తీయని జ్ఞాపకాల్ని..చెరిగిపోని స్వప్నాన్ని...
అనుక్షణం ఆస్వాదించేలా చేస్తుంది ఆ తలపుల్ని...

Saturday, June 27, 2009


మోమును తాకెను ముత్యపు చినుకులు ...
తొలకరిలో తీపి సందేశాల తొలి సంతకాలు ...
మనసు చేసెను
ఆనందతాండవాలు...
జవరాలితో జత కడుతున్న జతగాళ్ళు ...
కవ్విస్తున్న చిరు
గాలులు...
కౌగిలి లో కైదు కమ్మని సంకేతాలు ...
మారుతున్న ఋతువులు ...కలిగిస్తున్నాయి కొత్త కాంక్షలు ...

Tuesday, June 16, 2009


ఒక్కో క్షణం నీ తలపు నాలో ఏదో తెలియని పులకింత కలిగిస్తుంది ....
నాలో నాకే తెలియని సంఘర్షణ నను
నిద్రపోనీకుంది...
ఒక్కో నిమిషం చాలా దగరగా అనిపిస్తావు ...
మరు క్షణం తెలియని దూరాన్ని కలిగిస్తావు ...
నువ్వే నా ప్రపంచం అంటాను ...
నేను ఈ ప్రపంచం లో ఒక్కడిని అంటావు ...
సమాంతర రేఖ వై సతమత పెడుతున్నావ్ ...
నీ సమాదానం ఏది అయినా స్వికరించడానికి సిద్దం గా ఉన్నా ....

సర్వం నీవని తలచాను ...
నీ ముందే బహుమతి గా నిలిచాను ...
ప్రేమ తో పరితపించి పిలిచాను ...
తన్మయత్వం తో తేలిపోయాను ...
పులకింత తో పరవశించిపోయాను ...
ఆనంద డోలికల్లో
ఊయలలూగాను....
...............
ఇప్పుడు పరాయి దానిగా మిగలలేను...

Wednesday, May 27, 2009


ప్రేమంటే తెలియదంటావ్...
........
ప్రేమించానని అంటావ్ ...
మనసు లేదంటావ్ ...
........మనసు లో స్థానం వేరోక్కరికి ఇవ్వనంటావ్
కట్టుబాట్లు
లేవంటావ్...
..........
కట్టుబడి ఉంటావ్
ఇష్టం లేదంటావ్ ....
...........
అసూయపడుతుంటావ్
ఇలానే దూరంచేస్తుంటావ్ ...

ఆకాశాన్ని కాగితం గా చేసుకున్నా...
హరివిల్లు
ని కుంచ గా తెచ్చుకున్నా ...
చుక్కల్ని జోడించి చిత్రం గా మలచుకున్నా
...
మురిసిపోతూ నీ ముఖ చిత్రం
చూస్తున్నా...
కళ్లు తెరిచి కలకంటున్నా ...

మరమనిషినై జన్మిస్తా మరు జన్మలో ...
మనసుని నీకు అర్పించి ..మనసు లేని మనిషి గా జన్మించలేక ...
ఈ జన్మకి ఇక నీ ఆరాధన లో
అంకితమౌతా...
చివరి క్షణం వరకు చిరునవుల్ని కోరుకుంటా ...
ఆత్మ గా మారినా అనుక్షణం నీ ఆనందానికై తపిస్తా ...