
నీ మదిలో చోటిస్తావా..నీ యదపై ఒదిగిన నాకు ...
నీ ప్రేమను పంచుతావా..నీ ప్రేమకై పరితపించే నాకు ...
నీ మనసులో మాట తెలుపుతావా..నిను కలిసి మాటలు మరిచిన నాకు ...
నీ ప్రేమను బహుమతిగా ఇస్తావా ..నా జీవితానికి అర్ధం తెలుసుకునేందుకు ....
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి .. అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి .. ఆలోచనలకు ఆలంబనగా నిలిచి .. నను నేను గుర్తించేలా చేసిన నా ఊహల ప్రతి రూపానికి అంకితం ..
No comments:
Post a Comment