
నీకు తెలుసా ...
నువ్వు పలికే ఒక్క మాట చాలు ..పరవశించే కావ్యం గా మార్చడానికి ..
నీకు తెలుసా ...
నువ్వు పంచె ఒక్క క్షణం చాలు ..రోజు గడవడానికి ..
నీకు తెలుసా ...
నువ్వు చూసే ఒక్క చూపు చాలు ..వెన్నెలను మరచిపోవడానికి ..
నీకు తెలుసా ...
నీ మోమున ఓ చిరునవ్వు చాలు ..ఆనందానికి చిరునామా దొరికినదనడానికి...
నీకు తెలుసా ...
ఇవి నీ గురించి నీకే తెలియని నిజాలని ....
No comments:
Post a Comment