Tuesday, June 14, 2011


నేను ఆశావాదిని ...
నాతో
వస్తున్న వాటి కన్నా ...ముందున్న వాటి కోసం పోరాడతాను ..
నన్ను ప్రేమించే వారి కన్నా ..నెఉ ప్రేమించే వారికోసం తపిస్తాను ..
రోజు కాకపోతే ఇంకో రోజు వస్తుందని ...
అడుగు
ముందుకు వేస్తాను ...
నమ్మకాల్ని నమ్మను ...వాటిని నమ్మే మనుష్యుల మనసులని నమ్ముతాను ...
ప్రతి క్షణం కొత్త ఆశ తో పయనిస్తాను ...
మనస్పూర్తి గా ఏది కోరుకున్న దొరుకుతుంది అని నమ్మే నేన్ను ఆశావాదిని...

Monday, June 13, 2011


కనుల్లో కడలిని నింపుకున్న నాకు ..నీ ఓదార్పే ధైర్యనిచ్చింది ....
మాటలే పలుకలేని నన్ను వక్తగా మార్చింది ...
అర్ధం లేదు అనుకున్న జీవితం లో ఆనందం నింపింది ...
నీ ఔదార్యం చెరగని ముద్ర గా వేసి చిరు నవ్వుల్నీ నింపింది ...
జీవం పోసి జీవితానికి అర్ధం చెప్పింది ...
వ్యక్తిని వ్యక్తిత్వం తో మలచింది ...
ఇప్పుడు ఇలా మద్యలో వదిలి వెళ్తే ఎవ్వరితో చెప్పుకోను ..ఏమని మాట్లాడను..

ఏదో చెప్పాలనే ఆరాటం ...
ఎన్నో తెలుసుకోవాలనే ఆకాంక్ష ...
దాచాలన్న దగలేని భావాలూ ...
తడబడుతున్న మాటలు ...
కోటి ఆశల కంటి పాపలు ...
ని కంట పదాలని చేసే చిలిపి ప్రయత్నాలు ...
చివరికి పలికే చిరునవ్వుల వీడ్కోలు ....

నీ వెచ్చని శ్వాస లో చలికాచుకొనీ ...
నీ చెల్లని చూపులు వెలుగుల్ని నింపనీ ...
నీ అడుగుల అలికిడి తో నా నడకలు మొదలవనీ ...
నీ రంగుల ప్రపంచం లో నను ప్రకృతిని చూడనీ...
.

Bustope బృందావనం గా ..
Departmente దిక్కు గా ..
coridor ఏ classroom గా ...
Labs లోకం గా ...
Parking place ఏ Preparation place గా ...
Examination hall ఏ ఎదురుచుపులకై వుండగా ...
నువ్వు Trace చేసిన path temptation గా ...
Live coverageని repeated గా telecast చేస్తున్నట్టు గా..
Regular గా replay చేస్తూ చూస్తున్నా...నువ్వు కనిపిస్తావని ...

Wednesday, May 4, 2011


వద్దు.. వద్దు ..అంటూనే వెంట వస్తున్నా...
వెళ్లిపోతుంటే వద్దనలేకున్నా..
వెళ్ళిన క్షణం నుండి విలపిస్తున్నా...
వీడలేక వీడ్కోలు చెబుతున్నా....

Friday, April 29, 2011


ప్రేమ పుష్పించే ప్రతి చోట వెదచల్లుతుంది తన పరిమళాన్ని.....
ఆకర్షిస్తుంది అనంత జీవరాసుల్ల్ని...
విలపించేలా చేస్తుంది మనసున్న ప్రతీ జీవినీ...
మిగులుస్తుంది తీయని జ్ఞాపకాల్ని..చెరిగిపోని స్వప్నాన్ని...
అనుక్షణం ఆస్వాదించేలా చేస్తుంది ఆ తలపుల్ని...