కనుల్లో కడలిని నింపుకున్న నాకు ..నీ ఓదార్పే ధైర్యనిచ్చింది .... మాటలే పలుకలేని నన్ను వక్తగా మార్చింది ... అర్ధం లేదు అనుకున్న జీవితం లో ఆనందం నింపింది ... నీ ఔదార్యం చెరగని ముద్ర గా వేసి చిరు నవ్వుల్నీ నింపింది ... జీవం పోసి జీవితానికి అర్ధం చెప్పింది ... వ్యక్తిని వ్యక్తిత్వం తో మలచింది ... ఇప్పుడు ఇలా మద్యలో వదిలి వెళ్తే ఎవ్వరితో చెప్పుకోను ..ఏమని మాట్లాడను..
అణువణువున ఆత్మవిశ్వాసం నింపి ..
అశాద్రుక్పద జీవితాన్ని పరిచయం చేసి ..
ఆలోచనలకు ఆలంబనగా నిలిచి ..
నను నేను గుర్తించేలా చేసిన నా
ఊహల ప్రతి రూపానికి అంకితం ..