Saturday, June 27, 2009


మోమును తాకెను ముత్యపు చినుకులు ...
తొలకరిలో తీపి సందేశాల తొలి సంతకాలు ...
మనసు చేసెను
ఆనందతాండవాలు...
జవరాలితో జత కడుతున్న జతగాళ్ళు ...
కవ్విస్తున్న చిరు
గాలులు...
కౌగిలి లో కైదు కమ్మని సంకేతాలు ...
మారుతున్న ఋతువులు ...కలిగిస్తున్నాయి కొత్త కాంక్షలు ...

Tuesday, June 16, 2009


ఒక్కో క్షణం నీ తలపు నాలో ఏదో తెలియని పులకింత కలిగిస్తుంది ....
నాలో నాకే తెలియని సంఘర్షణ నను
నిద్రపోనీకుంది...
ఒక్కో నిమిషం చాలా దగరగా అనిపిస్తావు ...
మరు క్షణం తెలియని దూరాన్ని కలిగిస్తావు ...
నువ్వే నా ప్రపంచం అంటాను ...
నేను ఈ ప్రపంచం లో ఒక్కడిని అంటావు ...
సమాంతర రేఖ వై సతమత పెడుతున్నావ్ ...
నీ సమాదానం ఏది అయినా స్వికరించడానికి సిద్దం గా ఉన్నా ....

సర్వం నీవని తలచాను ...
నీ ముందే బహుమతి గా నిలిచాను ...
ప్రేమ తో పరితపించి పిలిచాను ...
తన్మయత్వం తో తేలిపోయాను ...
పులకింత తో పరవశించిపోయాను ...
ఆనంద డోలికల్లో
ఊయలలూగాను....
...............
ఇప్పుడు పరాయి దానిగా మిగలలేను...